నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని కాటాపూర్-2 అంగన్వాడి కేంద్రం వద్ద మంగళవారం అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని సూపర్వైజర్ శారద అంగన్వాడీ టీచర్లు మాజీ సర్పంచ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు సంవత్సరాలు దాటిన పిల్లల పేర్లను ఇంటింటి తిరిగి నమోదు చేసుకుంటామన్నారు. ఈ పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రంలో నర్సరీ తరగతులు ఇంగ్లీష్ మీడియం లో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించకుండా అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని కోరారు. గర్భిణీలు, బాలింతలు, చంటి పిల్లలకు అంగన్వాడీ కేంద్రం ద్వారా అందించే సేవలు గురించి వివరించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుల్లూరి గౌరమ్మ, అంగన్వాడి టీచర్లు సమ్మక్క, నిర్మల, శ్రీకళ, వెంకటలక్ష్మి, నాగమణి, జయమ్మ గర్భిణీలు బాలింతలు ఐకెపి గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.