అమ్మమాట.. అంగన్ వాడీ బాటా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలి: సీడీపీఓ

Ammamata.. Angan Wadi Bata program should be conducted successfully: CDPOనవతెలంగాణ – జుక్కల్

అమ్మ మాట.. అంగన్ వాడీ బాటా  కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని సీడీపీవో సునందా అన్నారు. సోమవారం నాడు మండలంలోని కేమ్రాజ్ కల్లాలీ తాండాలోని అంగన్ వాడీ కేంద్రంలో నిర్వహించిన అమ్మమాతా  అంగన్ వాడీ బాటా కార్యక్రమానికి ముఖ్యఅథితిగా పాల్గోన్నారు. ఈ సంధర్భంగా మన వనం కార్యక్రమంలో భాగంగా సెంటర్ ఆవరణలో  టీచర్ రాదా తో కలిసి మెుక్కలను నాటారు. అనంతరం కే.కల్లాలీ  గిరిజన తాండాలో విద్యార్థులతో  కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్భంగా అంగన్ వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిడీపీవో సునందా మాట్లాడుతు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ఆదేశాలనుసారం మండలంలోని యాబై రెండు అంగన్ వాడీ కేంద్రంలో  జూలై 15 వతేది నుండి జూలై 20వ తేది వరకు కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.  మూడు సంవత్సరాలు నిండి పైబడిన పిల్లలకు సెంటర్ లో ఖచ్చితంగా చేర్చాలని తెలిపారు. జూలై 15,16 తేదిలలో సెంటర్ పరిది ఉన్న  గ్రామాలలో ఏడబ్ల్యుటీఎస్ , ఏడబ్ల్యుహెచ్ఎస్ , కౌమార బాలీకలు , ఎస్ఎస్జీ  సంఘాలు, గ్రామస్తులు, పాఠశాల ఉపాద్యాయులు, యువత, ఎన్జీవోలు తల్లి దండ్రులతో  ర్యాలీ నిర్వహించడం, పిల్లలను అంగన్ వాడీ కేంద్రాలకు పంపడం, మరియు పాఠశాలలో,  కాళాశాలలో డ్రాప్ అవుట్ అయిన చెర్పించుకోవడం కోసం గ్రామస్తులకు అవగాహన కల్పించడం చేయాలని అన్నారు. జూలై 18 వ తేదిన రెండున్నర సంవత్సరాలు నిండిన పిల్లలను గుర్తించి వారి ఇళ్లకు సందర్శించాలీ. ప్రీ స్కూల్ కార్యక్రమాలు, సెలబస్, టైంటేబుల్, వర్క్ బుక్స్ కిట్  మెటీరీయల్,  స్కూల్ రెడినెస్ యాక్టివిటిస్ గురించి పిల్లల తల్లిదండ్రులకు తెలియ చేయాలీ , ప్రాథమీక పీఛశాలలో 5మంది పిల్లలను నమేాదు  చేయడం జర్గాలని తెలిపారు. జూలైః 19వ తేదిన స్వచ్చ అంగన్ వాడీ, సిద్దంగా ఉన్న తరగతి గది, సెంటర్ అవరణలో పరిశుభ్రత పాటీంచాలీ, త్రాగునీరు, మరుగు దొడ్లు ఉపయేాగంలోకి తీసుకోని రావాలని, పిల్లలకు స్నేహ పూర్వక వాతావరణం సృష్టించాలని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో సిడీపీవో సునందా, కేమ్రాజ్ కల్లాలీ తాండా అంగన్ వాడీ టీచర్ రాదా, గ్రామ మహిళలు, పిల్లల తల్లులు తదితరులు పాల్గోన్నారు.