కాస్తూర్బా ఆశ్రమ పాఠశాల బాలికలకు ఏఎమ్మార్ ఉచిత బస్సు

నవతెలంగాణ – మల్హర్ రావు
పదవ తరగతి వార్షిక పరిక్షలు జరుగుతున్న నేపథ్యంలో మండలంలోని మల్లారం,దుబ్బపేట గ్రామాల పరిధిలో ఉన్న కాస్టూబ్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న బాలికలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఏఎమ్మార్ పిఆర్ఓ మల్లేష్ తెలిపారు.ఈ సందర్భంగా పిఆర్ఓ మాట్లాడారు బాలికలు మండల కేంద్రమైన తాడిచెర్లలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడంతో బాలికలకు దూరబారం ఉండడమే కాకుండా రవాణ సౌకర్యం లేకపోవడంతో ఉపాధ్యాయుల వినతి మేరకు ఏఏమ్మార్ హెడ్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు బస్సును ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు.