బాధిత కుటుంబానికి ఏఎమ్మార్ కార్మికులు చేయూత

– రూ.2లక్షల ఆర్థిక సాయం అందజేసిన తోటి కార్మికులు 
నవతెలంగాణ –  మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన ఇందారపు రాకేష్, (23) అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అతడు కొన్ని సంవత్సరాలుగా కాపురం ఓసిపి బ్లాక్-1 బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల రాకేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. అతని కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో ఇదే కంపెనీలో మ్యాన్వే ఇంచార్జిగా ఉద్యోగం చేస్తున్న కేశారపు సురేందర్ ఆధ్వర్యంలో ఏఎమ్మార్ కంపెనీ హెడ్ మేనేజర్  చెంద్రమొగిలి,హెచ్ఆర్ డిజిఎం రవికుమార్ ప్రోత్సాహంతో మరికొందరు ఉద్యోగుల కార్మికుల సహాయంతో రాకేష్ కుటుంబానికి రూ. 2లక్షల ఆర్థిక సహాయం అందజేసి చేయుతనిచ్చారు.