నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి నిజామాబాద్ వెళ్లే దారిలోని డివైడర్ మధ్యల గత ప్రభుత్వం పట్టణ హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్షలు వెచ్చించి మొక్కలు నాటినారు. గురువారం ఈ వృక్షాలను మున్సిపల్ కార్మికులు నరికేసినారు. పలు దేశాల్లో నిషేధించబడిన కోనొ కర్పాస్ మొక్కల వల్ల జరిగే పరిణామాలపై గత సంవత్సరం అక్టోబర్ 12న నవతెలంగాణలో అమ్మో … కోను కర్పాస్ ..అంటూ కథనం ప్రచురితమైంది. ఒక సంవత్సరంలోపే ఏపుగా పెరిగి వృక్షాలు కాగా, పచ్చదనం మినహా ఎటువంటి ఫలితాలు లేవు. కాగా ఈ మొక్కల నుండి వెలువడే పుప్పొడ్లు, అలర్జీలు అస్తమాకు కారణమవుతాయి. రోడ్డు ప్రమాదాలు జరగడం, ఇవి పెద్దగా పెరగడంతో డివైడర్లు ధ్వంసం అవుతున్నాయని, దీంతో నరికి వేసినట్టు మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు.