సావర్ గావ్ అంగన్ వాడీ సెంటర్ లో అమ్న మాత… అంహన్ వాడీ బాట.

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని సావర్ గావ్ తాండాలోని సెంటర్ లో గురువారం నాడు కేంద్రం టీచర్ బుజ్జి బాయి అధ్వర్యంలో సిడిపీవో ఆదేశాలనుసారం అమ్మమాతా.. అంగన్ వాడీ బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా గ్రామములో విద్యార్థులు, యువకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళ సంఘాల సబ్యులు, విద్యార్థులు పేరేంట్స్ తో కలిసి తాండాలో ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్భంగా గ్రామస్తులకు పలు సూచనలు చేసారు. రెండున్నర సంవత్సరాలు పూర్తీ చేసుకున్న పిల్లలను గుర్తించి వారి ఇండ్లకు వెళ్లి పేరేంట్స్ తో మాట్లాడాలని, ఫ్రీ స్కూల్ సెవలబస్ గురించి తాము తెలియచేయ చేస్తామని, కిట్ మెటిరీయల్ స్కూల్ రెజినెస్ యాక్టీవిటిస్, డెవలప్ మెంట్ అసెస్ మెంట్ కార్జు, నిరంతరం అంచనా వేయడం, ఏడబ్ల్యుసీ పిల్లలను నమేాగు చేయడం, ప్రాథమీక పాఠశాలలో ఐదుగురు పిల్లలను అడ్మీట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ సెంటర్ టీచర్ బుజ్జిబాయి, సెక్రట్రి రవికూమార్, యువకుడు సంజీవ్ తదితరులు పాల్గోన్నారు.