– భారతదేశ పునరుత్పాదక ఇంధన పరివర్తనకు శక్తినిచ్చే ఏకైక దిగుమతి ప్రత్యామ్నాయం
– దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది, డెలివరీ సమయాలను తగ్గిస్తుంది
– ఆత్మనిర్భర్ భారత్‌కు మద్దతు ఇస్తుంది
– భారతదేశ సౌర రంగానికి సేవలు అందిస్తుంది
– ఏఎం/ఎన్ఎస్ ఇండియా 50% కంటే ఎక్కువ మార్కెట్ వాటాను లక్ష్యంగా చేసుకుంది
నవతెలంగాణ ముంబై: ప్రపంచంలోని రెండు ప్రముఖ ఉక్కు తయారీదారులైన ఆర్సెలార్ మిట్టల్ మరియు నిప్పన్ స్టీల్‌ల మధ్య జాయింట్ వెంచర్ అయిన ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా (ఏఎం/ఎన్ఎస్ ఇండియా) – అసమానమైన తుప్పు నిరోధకతతో, స్వీయ స్వస్థత లక్షణాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉక్కు బ్రాండ్ మాగ్నెలిస్ ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ముంబైలో సోమవారం జరిగిన భారీ కార్యక్రమంలో వినూత్న స్టీల్ బ్రాండ్‌ను ఆవిష్కరించారు. ఆర్సెలార్ మి ట్టల్ పేటెంట్ బ్రాండ్ అయిన మాగ్నెలిస్ ఇప్పుడు భారతదేశంలో తయారు చేయబడుతోంది, పంపిణీ చేయ బడుతోంది. తద్వారా దిగుమతి చేసుకున్న ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు పునరుత్పాదక శక్తి వంటి వ్యూహాత్మకంగా ముఖ్యమైన, అధిక అభివృద్ధి రంగాలకు సరఫరా సామ ర్థ్యాన్ని పెంచుతుంది.
ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా (ఏఎం/ఎన్ఎస్ ఇండియా) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దిలీప్ ఊమెన్ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో మాగ్నెలిస్ ని ప్రారంభించడం అనేది దేశంలో పెరుగుతున్న ఉక్కు డిమాండ్ ను నెరవేర్చడానికి మాకు గల నిబద్ధతకు నిదర్శనం. ఇది ఆత్మనిర్భర్ భారత్ ఆశయసాధనకు తోడ్పడు తుంది. ఈ ప్రపంచ స్థాయి, దిగుమతి-ప్రత్యామ్నాయ ఉక్కును ఉత్పత్తి చేయడం ద్వారా మేం నాణ్యమైన మౌలిక సదుపాయాల పరిష్కారాలను అందించడమే కాకుండా భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తనను వేగ వంతం చేయడానికి కూడా సహకరిస్తున్నాం. మాగ్నెలిస్ అనేది సుస్థిర పదార్థాల భవిష్యత్తు. దాన్ని ప్రవేశ పెట్టడం ప్రపంచ స్థాయి ప్రామాణిక మౌలిక సదుపాయాలను నిర్మించడంలో దేశం యొక్క ముఖ్యమైన దశ ను సూచిస్తుంది’’ అని అన్నారు. ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా (ఏఎం/ఎన్ఎస్ ఇండియా) డైరెక్టర్, సేల్స్ & మార్కెటింగ్ వైస్ ప్రెసి డెంట్ శ్రీ రంజన్ ధర్ మాట్లాడుతూ, “ఈ ప్రత్యేక ఉత్పాదన మాగ్నెలిస్ ఇప్పటికే అంతర్జాతీయ సోలార్ ప్రాజె క్టులలో తన పనితీరును నిరూపించుకుంది, 50 GW స్థాపిత సామర్థ్యానికి దోహదపడుతోంది. భారత దేశం లో దీన్ని ఆవిష్కరించడం మాకు కీలక సందర్భం. ఇక్కడ ఈ కొత్త ఉత్పాదనను ఉత్పత్తి చేయడం అనేది డెలివరీ సమయాన్ని తగ్గిస్తుంది.
లాజిస్టిక్స్ ఖర్చులను భారీగా తగ్గిస్తుంది. తద్వారా భారత దేశం తన దేశ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నందున దేశీయ వినియోగదారులకు వారి మౌలిక సదుపాయాల అవసరాల కోసం వేగవంతమైన, మరింత సమర్థవంతమైన ఉత్పాదనను అందిస్తుంది. ఇతర అంతిమ విని యోగ రంగాలలో రహదారి మౌలిక వసతులు (క్రాష్ బారియర్స్), వ్యవసాయ మౌలిక సదుపాయాలు (ధా న్యం నిల్వ నిర్మాణాలు, వ్యవసాయ పరికరాలు), నిర్మాణం (ప్రి-ఇంజనీరింగ్ భవన నిర్మాణాలు) ఉన్నాయి’’ అని అన్నారు. మాగ్నెలిస్ అనేది జింక్, అల్యూమినియం, మెగ్నీషియం ప్రత్యేక కూర్పుతో కూడిన అధునాతన అల్లాయ్ కోటెడ్ స్టీల్ బ్రాండ్. ఇది అసాధారణ తుప్పు నిరోధకత, స్వీయ-స్వస్థత లక్షణాలను అందిస్తుంది. గతంలో, ఈ హై-ఎండ్ వాల్యూ-యాడెడ్ స్టీల్ ప్రధానంగా కొరియా, జపాన్, చైనా నుండి దిగుమతి చేయబడింది, తరచుగా డెలివరీకి నెలల సమయం పడుతుండేది.
ఏఎం/ఎన్ఎస్ ఇండియా గుజరాత్‌లోని హజీరాలోని తన ఫ్లాగ్‌షిప్ ప్లాంట్‌లో సంవత్సరానికి 5 లక్షల టన్నుల సామర్థ్యంతో మాగ్నెలిస్ సంబంధిత ఉత్పత్తి శ్రేణిని ఉత్పత్తి చేసేందుకు దాదాపు ₹1000 కోట్లు పెట్టుబడి పె ట్టింది. సోలార్ ప్రాజెక్ట్‌లకు సరఫరా చేయబడిన ఉక్కుకు సంబంధించి దేశీయ మార్కెట్ వాటాలో 50% కంటే ఎక్కువ స్వాధీనం చేసుకోవాలని ఏఎం/ఎన్ఎస్ ఇండియా యోచిస్తోంది. ప్రతికూల వాతావరణంలో ఈ ఉత్పాదన నిరూపిత పనితీరు సోలార్ ప్యానెల్ మౌంటు సిస్టమ్‌లు, ఇతర పునరుత్పాదక ఇంధన వినియో గాలకు ఆదర్శవంతంగా ఉంటుంది, ఇది భారతదేశ శక్తి పరివర్తనకు మద్దతుగా ఉంటుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్‌టిపిసితో సహా భారతదేశ పునరుత్పాదక శక్తి, మౌలిక సదుపాయాల రంగాలలోని కీలక సంస్థలకు మాగ్నెలిస్ ని సరఫరా చేయడానికి ఏఎం/ఎన్ఎస్ ఇండియా ఇప్పటికే తుదిదశ చర్చల్లో ఉంది. ఇటువంటి భాగస్వామ్యాలు దేశవ్యాప్తంగా తదుపరి తరం పునరుత్పాదక ప్రాజెక్టులను నిర్మించడంలో మాగ్నెలిస్ ఒక మూలస్తంభంగా ఉండేలా చూస్తాయి.