నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
ఎన్నికల ప్రచారం ముగియడంతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి అమ్రారామ్ చివరకు సికార్ జిల్లాలోని డాటా అనే చిన్న పట్టణంలో ప్రచారం చేస్తున్నారు. ఆయన పండ్లు, కూరగాయలు అమ్మే వీధికి చేరుకున్నప్పుడు, ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆయన ఎర్రటి తలపాగా, శాలువా ధరించాడు. అమ్రారామ్ విజయాన్ని కాంక్షిస్తూ తరలివచ్చిన ప్రజలకు వెంటనే పండ్లు పంపిణీ చేశారు.
అమ్రారామ్ రెండు మాటలు మాట్లాడాలని వీధి వ్యాపారులు ప్రేమతో డిమాండ్ చేశారు. లేచి నిలబడి మాట్లాడేందుకు వేదిక లేదు. అమ్మకందారులు పండ్లు, ఇతర వస్తువులను ఉంచడానికి బాక్సులను తీసుకువచ్చారు. వాటిపై నుంచి మాట్లాడారు. నీటి కొరత ప్రధాన సమస్య. నీటి ఎద్దడిని తీర్చేందుకు తాను తలపెట్టిన పథకాలను అమ్రారామ్ వివరించారు. ఏడాదిలో నియోజకవర్గంలో జరిగిన అభివద్ధి లోపాన్ని వివరించారు. రైతుల కోసం కిసాన్ సభ చేసిన పోరాటాలను వివరిస్తూ ఓట్లు అడగడంతో ప్రసంగం ముగిసింది. అనంతరం నినాదాల హోరుతో అమ్రారామ్‌కు వీడ్కోలు పలికారు.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా అమ్రారామ్ గెలిచారు. 2008లో దాతరంగఢ్‌లో గెలుపొందారు. అంతకు ముందు సికార్‌లోని ధోడ్ నుంచి వరుసగా మూడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 2008 నుంచి, ధోడ్ రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా మారినప్పటి నుంచి, ఆయన దాతరంగఢ్‌లో పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచారు. 2018లో కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచిన వీరేంద్ర సింగ్‌కి దాదాపు ఇరవై వేల ఓట్ల తేడా వచ్చింది. వీరేందర్ సింగ్ 920 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి హరీశ్ చంద్ కుమావత్‌పై విజయం సాధించారు.
వీరేంద్ర సింగ్ బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ నారాయణ్ సింగ్ కుమారుడు, ఆయన ఏడుసార్లు దాతరంగఢ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అమ్రారామ్ 2008లో నారాయణ్ సింగ్‌ను ఓడించాడు. 2013లో నారాయణ్‌సింగ్ మళ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2018లో తన కుమారుడిని బరిలోకి దింపాడు. 1952లో జరిగిన మొదటి ఎన్నికలలో ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు భైరన్ సింగ్ షెకావత్ జన్ సంఫ్‌ు టిక్కెట్‌పై గెలిచిన నియోజకవర్గం దాతరంగఢ్. జనసంఫ్‌ు మరోసారి విజయం సాధించింది.
కానీ బీజేపీకి దాతరంగఢ్ ఎప్పుడూ ఓడిపోతూ వస్తుంది. బీజేపీ సీనియర్ నేత హరిశ్‌చంద్ కుమావత్ గత రెండు ఎన్నికల్లో పోటీ ఇచ్చారు. దాతరంగఢ్‌లో భార్యాభర్తలు ఒకరితో ఒకరు పోటీపడడాన్ని కూడా ఆసక్తిగా ఉంది. కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్ పోటీ చేస్తుండగా, ఆయన భార్య రీటా చౌధురి కూడా జేేజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. జిల్లా మాజీ నాయకురాలు రీటా కాంగ్రెస్ టికెట్ పై ఆసక్తి చూపారు. కానీ సచిన్ పైలట్ పట్టుబట్టడంతో వీరేంద్ర సింగ్ స్వయంగా అభ్యర్థి అయ్యాడు. దీంతో రీటా హర్యానాలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీ అయిన జేజేపీలో చేరారు. రీటా అభ్యర్థిత్వం కాంగ్రెస్ ఓట్లను చీల్చుతుంది. బీజేపీ తరపున కొత్త గజానంద్ కుమావత్ రంగంలో ఉన్నారు.