
తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మేరీ మట్టి మేరీ దేశ్ అమృత కలుష యాత్రలో భాగంగా కళాశాల ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ..ఈ కార్యక్రమంలో భాగంగా మట్టి బియ్యం సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జి ధనవేని విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు. యువతలో దేశభక్తి ఉండాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శరణ్య ,ఎన్ ఎస్ స్ కోఆర్డినేటర్ చైతన్య శాంతి, అధ్యాపకులు విద్యార్థినిలు పాల్గొన్నారు.