నవతెలంగాణ హైదరాబాద్: యువకవి అమృతరాజు రచించిన ‘పిలుపు’ కవితా సంపుటిని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డా.పసునూరి రవీందర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో రవ్వా శ్రీహరి వేదికపై బుధవారం వి.దిలీప్ అధ్యక్షతన జరిగిన సభలో కేంద్రం సాహిత్య అకాడెమీ యువ పురస్కార గ్రహీత మెర్సీ మార్గరెట్, అభినవ్ తదితరులు పాల్గొన్నారు.