– సీపీఎం అనుబంధ ప్రజా సంఘాల నాయకుల
– ఎమ్మెల్యే జయవీర్ రెడ్డికి వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – నాగార్జునసాగర్
ఏఎమ్ఆర్పి వరద కాలువలకు నీటి విడుదల చేయాలని కోరుతూ సీపీఎం అనుబంధ ప్రజా సంఘాల నాయకులు ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి ని గురువారం నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం పలువురు ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ…వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నియోజకవర్గంలోని పలు గ్రామాలలో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి ఇబ్బంది ఎదురవుతుందని నియోజకవర్గంలో పదివేల ఎకరాలకు పైచిలుకు పండ్ల తోటలు ఉన్నాయని బావులు బోర్ల కింద వరిచేలు వేశారు. శనగచేలు పీకడానికి వచ్చాయి. ప్రతి గ్రామంలో 90% బోర్లు ఎండిపోయాయి. సాగుకు నీరు లేక రైతులు లబోదిబోమంటున్నారు. పశు జీవాలకు తాగేందుకు నీరు లేదు. మన నియోజకవర్గంలోనుండి వెళ్లే ఏఎంఆర్పి వరద కాలువల ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు కుంటలు నింపితే భూగర్భ జలాలు పెరిగేందుకు తోడ్పడుతుందని పండ్ల తోటలు బతుకుతాయి. వరి పంట వేరుశెనగచేలు చేతికొస్తాయని అన్నారు. రైతుల కష్టాలను తెలుసుకొని వారం రోజులపాటు నీటిని విడుదల చేయించాలని ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి ని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్ రెడ్డి నాగిరెడ్డి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కత్తి శ్రీనివాస్ రెడ్డి,సిఐటియు జిల్లా నాయకులు ఎస్కే బషీర్, కెవిపిఎస్ జిల్లా నాయకులు దొంతాల నాగార్జున, రైతుకు నరేష్, బీమా, హాతిరాం,పాండు,శంకర్ తదితరులు ఉన్నారు.