రాజకీయ నేపథ్యంలో కార్యకర్త

An activist in a political contextమోక్షజ్ఞ సమర్పణలో నక్షత్ర మీడియా అసోసియేషన్స్‌లో జిఎంఆర్‌ ప్రొడక్షన్‌ నిర్మిస్తున్న పొలిటికల్‌ మూవీ ‘కార్యకర్త’. ఈ సినిమా టైటిల్‌ అనౌన్సమెంట్‌ పోస్టర్‌ లాంచ్‌ వేడుక మాదాపూర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ‘నాతో నేను’ డైరక్టర్‌, జబర్దస్త్‌ శాంతి కుమార్‌ విచ్చేసారు. ఈ చిత్రంలో ఆదిత్య ఓం ముఖ్య పాత్రలో నటిస్తుండగా, శ్రీనివాస రెడ్డి టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. శిరీష, విజయ, సుమన్‌ శెట్టి, శాంతికుమార్‌, షానీ, నారి సర్కార్‌, మధు తదితరులు ఇతర పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ పొలిటికల్‌ మూవీ సిరీస్‌కు జి.శ్రీనివాస్‌ కథను అందించగా, రాఘవ తిరువాయిపాటి స్క్రీన్‌ప్లే సమకూర్చటంతోపాటు దర్శకత్వం వహిస్తున్నారు.