చీకటి యుగాల నేపథ్యంలో భ్రమయుగం

ప్రత్యేకంగా హర్రర్‌, థ్రిల్లర్‌ జోనర్‌ చిత్రాలను నిర్మించడానికి నిర్మాత చక్రవర్తి రామచంద్ర స్థాపించిన నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌ నిర్మాణ సంస్థ గురువారం ప్రారంభ మైంది. అలాగే ఈ సంస్థ ప్రారం భం రోజునే తాము నిర్మించబోయే మొదటి సినిమా ‘భ్రమయుగం’ని ఘనంగా ప్రకటించడం విశేషం. మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్‌ సదాశివన్‌ రచన-దర్శకత్వం చేస్తున్నారు. ఈ సందర్భంగా మమ్ముట్టి మాట్లాడుతూ, ‘ఇదొక ఉత్తేజకరమైన చిత్రం. నేను మునుపెన్నడూ పోషించని పాత్రను పోషిస్తున్నందున ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. దర్శకుడు రాహుల్‌ అద్భుత ప్రతిభ, నిర్మాతలు రామ్‌-శశిల అభిరుచి ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకం చేశాయి’ అని అన్నారు. ”భ్రమయుగం’ అనేది కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగే కథ’అని రచయిత, దర్శకుడు తెలిపారు. నిర్మాతలు చక్రవర్తి రామచంద, ఎస్‌.శశికాంత్‌ మాట్లాడుతూ,’మమ్ముక్కా అసమానమైన ఇమేజ్‌తో ఈ చిత్రం మరో స్థాయికి వెళ్తుంది. ‘భ్రమయుగం’ అనేది ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి మా దర్శకుడు రాహుల్‌ సష్టించిన అద్భుత ప్రపంచం’ అని చెప్పారు. ఈ చిత్రాన్ని కొచ్చి, ఒట్టపాలంలో భారీస్థాయిలో చిత్రీకరిస్తున్నారు. వైనాట్‌ స్టూడియోస్‌ సమర్పిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.