యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వారి ప్రేమకు ప్రతిరూపాలుగా ఒక కుమారుడు, కుమార్తె నిలిచారు. కులాంతర వివాహం చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి మద్యానికి బానిసై గురువారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానిక ఎస్సై శ్రావణ్ కుమార్ సంక్షిప్త సమాచారం మేరకు.. మండలంలోని వెంకటేశ్వర పల్లి గ్రామానికి చెందిన గూబ వెంకటేష్ (30) ఇంటర్ వరకు చదివాడు.. చదువు వంట పట్టకపోవడంతో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇదే క్రమంలో దర్యా తండాకు చెందిన సుజాతతో ప్రేమలో పడ్డాడు. పెద్దలను ఒప్పించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం కలదు. వ్యవసాయం చేసుకుంటూ బతుకు బండిని లాగిస్తున్న వెంకటేష్ గత కొంతకాలంగా మధ్యానికి బానిస అయ్యాడు.. దాంతో కొంత అప్పలపాలయ్యాడు. ఎందుకు తాగుతున్నావు అప్పులు ఇలా తీరాలి ? అని అతని భార్య సుజాత గోడును వెల్లబుచ్చుకుంది. దాంతో మనస్థాపానికి గురైన వెంకటేష్ గురువారం రాత్రి ఇంట్లో ఒక గదిలో అందరూ నిద్రిస్తుండగా. పక్క గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య లేచి చూడగా పక్క గదిలో మిగతాజీవిగా వేలాడుతున్నాడు వెంటనే ఆమె చుట్టుపక్క వారిని పిలిచింది వారు మృతి దేహాన్ని కిందికి దింపారు. పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రికి మృతి దేహాన్ని తరలించినట్లు తెలిపారు. మృతుని తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.