
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మద్యానికి బానిసై భార్యను చంపిన భర్తను రెండవ తేదీన అరెస్టు చేసి డిచ్పల్లి సీఐ రిమాండ్కు తరలించారని జక్రాన్ పల్లి ఎస్సైతిరుపతి ఆదివారం తెలిపారు. జక్రాన్ పల్లి మండలం నూర్ సింగ్ తాండకు చెందిన వివాహిత/మృతురాలు కేలోత్ సరితకు దాదాపు 20 సం..ల క్రితము అదే గ్రామానికి చెందినా కేలోత్ శ్రీనివాస్ అలియాస్ సుధాకర్ అను వ్యక్తితో వివాహం జరగగా, ఆమె భర్త శ్రీనివాస్ మద్యానికి బానిస అయి తరుచుగా భార్యతో గొడవ పడుతూ చిత్రహింసలకు గురిచేస్తూ కొడుతూ ఉండేవాడు, తేది 01.03.2024 నాడు, మద్యహ్నం అందాజ 02:00 గం లకు ఇంటికి వచ్చిన ఆమె భర్త మృతురాలిని ఏదో ఒక గొడవ పెట్టుకొని ఆ లోల్లిలో ఎలాగైనా చంపాలని అనుకుని పథకం ప్రకారo తేది: 01-03-2024 నాడు సాయంత్రం ఇంట్లోలేని సమయములో మృతురాలితో గొడవ పడి చేతులతో ముఖం పైన పిడిగుద్దులు గుద్ది ఇంట్లో ఉన్న గొడ్డలితో ఆమె తలపైన ఇతర చోట్ల విపరీతంగా కొట్టగా మృతురాలు అక్కడికక్కడే చనిపోయింది. ఇట్టి సంఘటన విషయంలో తొలుత అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంబించి నిందితుడు అయిన కేలోత్ శ్రీనివాస్ ను కె. మల్లేష్ సి. ఐ డిచ్ పల్లి శనివారం అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించడం మైనదని ఎస్సై తిరుపతి ఆదివారం తెలిపారు.