మోహన్‌లాల్ టైటిల్ రోల్‌లో నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించిన ఎపిక్ ఫాంటసీ అడ్వంచర్ ‘బరోజ్ 3డీ’. ఈ సినిమాని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా నేడు (బుధవారం) ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. హీరో, డైరెక్టర్ మోహన్ లాల్ మాట్లాడుతూ,’గత నాలుగు దశాబ్దాలుగా అద్భుతమైన చిత్ర పరిశ్రమలో భాగం కావడం ఓ గౌరవంగా భావిస్తున్నాను. ఎన్నో కథలు, పాత్రలతో మీకు చేరువయ్యాను. మీ ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించానని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఇది త్రీడీ ఫిల్మ్. నేటీవ్ త్రీడీలో తీసిన సినిమా. గత 40 ఏళ్ళుగా ఈ ఫార్మెట్‌లో సినిమాని ఎవరూ ప్రయత్నించలేదు. ఇది చిల్డ్రన్ ఫ్రెండ్లీ ఫిల్మ్. పిల్లలు, పెద్దలు అందరూ చూడాల్సిన సినిమా. చాలా ప్రేమతో తీశాం. మనలోని బాల్యాన్ని సెలబ్రేట్ చేసుకునే సినిమా. స్టొరీ టెల్లింగ్ చాలా కొత్తగా ఉంటుంది. సంతోష్ శివన్ లాంటి బెస్ట్ కెమరామెన్ ఈ సినిమాకి పని చేశారు. ఫస్ట్ త్రీడీ ఫిల్మ్‌కి పని చేసిన నా ఫ్రెండ్ రాజీవ్ కుమార్ ఇందులో పార్ట్ అయ్యారు. బాల మేధావి లిడియన్ నాదస్వరం ఈ సినిమాకి పాటలు సమకూర్చారు. తనలో అమాయకత్వం స్వచ్చమైన పాటలని అందించాయి. ఈ సినిమా బీజీఎం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్‌తో అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. గ్రేట్ విజన్‌తో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచం అంతా చూడదగ్గ సినిమా ఇది’ అని అన్నారు.