ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో భారత రూపాయి విలువ వెలవెల పోతోంది. బుధవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 83.40కు పడపోయింది. ఇంతక్రితం సెషన్‌లో 83.38 వద్ద ముగిసిం ది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షా నేపథ్యంలో రూపాయి విలువ తగ్గిందని ఫారెక్స్ నిపుణులు పేర్కొన్నారు. ఇంతక్రితం నవంబర్ 10న రూపాయి విలువ 83.42 కనిష్ట స్థాయిని తాకింది. డిసెంబర్‌లో మరింత తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. రూపాయి విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 1.5 శాతం పతనాన్ని చవి చూసింది. గడిచిన నవంబర్‌లో 0.2 శాతం విలువ తగ్గింది.