దేవి దిన్ బాగ్ లో పురాతన భవనం కూలి పోయింది..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 

హనుమాన్ టెకీడీ లోని దేవి దిన్ బాగ్  లోనీపురాతన భవనం గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షంతో మంగళవారం ఉదయం కూలిపోయింది. అందులో ఉన్న వారికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు ఈ పురాతన భవనాన్ని గోషామహల్ సర్కిల్-14 జిహెచ్ఎంసి అధికారులకు సందర్శించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పక్కనే ఆర్య కన్య విద్యాలయ  పాఠశాల ఉండడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.