నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర నడిమి హనుమాన్ ఆలయానికి ఒకరు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించి ఆలయ అభివృద్ధికి సహకరించినప్పటికీ నా పేరు బయటకు రావద్దని చెప్పుకొచ్చారు. నడిమి హనుమాన్ ఆలయ అభివృద్ధికి దాదాపు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి పరుస్తూ మంగళవారం నాడు ఆలయంలో ప్రత్యేకంగా అభిషేక పూజలు, భజన కార్యక్రమం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి దాత ముందుకు వచ్చినప్పటికీ పనులు చేయించడంలో వంకాయల వార్ సంజు మేస్త్రి ముందుండి జరిపించారు. అభిషేక పూజలకు ఆలయ భజన మండలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించారు. నడిమి హనుమాన్ ఆలయం గ్రామస్తులు ప్రత్యేకంగా గుర్తింపు ఎందుకంటే పెళ్లి పేరంటాలు జరిపటానికి సేవన్జాల్ ఇక్కడి నుండే జరుపుతారు. మంగళవారం నాడు నిర్వహించిన అభిషేక పూజలు అన్నదాన కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.