రోజుకో యాపిల్‌

రోజుకో యాపిల్‌యాపిల్స్‌ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజుకో యాపిల్‌ రోగాలను దూరం చేస్తుందని వైద్యులు కూడా చెబుతున్నారు. ఇవి శరీరంలోని అనేక కణాల ఏర్పాటుకు అవసరమైన కొన్ని మూలకాలూ కలిగి ఉంటాయి. వీటిలో పొటాషియం, ఫాస్పరస్‌, మెగ్నీషియం, ఐరన్‌ పుష్కలంగా ఉన్నాయి. ఐరన్‌ శరీరంలో హిమోగ్లోబిన్‌ లోపాన్ని నివారిస్తుంది. అంతేకాదు యాపిల్స్‌ చర్మ వ్యాధులు, గుండె, జ్వరం, మలబద్ధకం వంటి వాటికి మేలు చేస్తాయి.
రోగనిరోధక శక్తి – రోజూ యాపిల్‌ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఫైటోకెమికల్స్‌ ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
షుగర్‌- యాపిల్స్‌ డయాబెటిస్‌లో కూడా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. యాపిల్స్‌లోని పీచు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా మధుమేహాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. యాపిల్‌ తినడం వల్ల డయాబెటిస్‌ రిస్క్‌ 18 శాతం తగ్గుతుంది.
ఎముకలు – యాపిల్స్‌లో కాల్షియం, ఫాస్పరస్‌ , పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బోలు ఎముకల వ్యాధిని పోషకాహార సప్లిమెంట్లతో చికిత్స చేయవచ్చు. యాపిల్స్‌ తీసుకోవడం వల్ల ఎముకల బలహీనతను నివారించవచ్చు.
బరువు – యాపిల్స్‌ తినడం వల్ల బరువు తగ్గవచ్చు. యాపిల్స్‌లో పాలీఫెనాల్స్‌, డైటరీ ఫైబర్‌, కెరోటినాయిడ్స్‌ ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు అనేక ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీని ద్వారా స్థూలకాయాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
అయితే యాపిల్స్‌ను అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి హానీ జరిగే ప్రమాదముంది. ఖాళీ కడుపుతో ఎక్కువ మొత్తంలో యాపిల్స్‌ తీసుకోవడం వల్ల డయేరియా వస్తుంది. అలాగే అధికమొత్తంలో యాపిల్స్‌ తినే వారు తలనొప్పి, తల తిరగడం, అలసట వంటి సమస్యలకు గురవుతారు.