అర్ధరాత్రి సమయంలో పేకాట స్థావరం పై దాడి

– అయిదుగురు వ్యక్తులపై కేసు
– పట్టుబడ్డ రూ.3300 , 
– పేకాట ఆడితే కఠిన చర్యలు ఎస్సై

నవతెలంగాణ – మద్నూర్
అర్ధరాత్రి 12:30 తెల్లవారుజామున సమయంలో నమ్మదగిన సమాచారంపై మద్నూర్ గ్రామo,పోచమ్మ గల్లీలో పేకాట ఆడుతున్న స్థావరంపై  మద్నూర్ ఎస్సై విజయ్ కొండ తన  సిబ్బందితో కలిసి రైడ్ చేసి రూపాయిలు 3300/- స్వాధీన పరచుకొని పేకాట ఆడుచున్న అయిదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగింది. మంగళవారం సాయంత్రం ఎస్సై విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. పేకాట ఆడుతున్న స్థావరాల సమాచారం అందించాలని అలాంటి వారి పేర్లు గొప్ప్యంగా ఉంచుతామని తెలిపారు.