ప్రభుత్వ ఆస్తులపై దాడి.. ప్రజలపై దాడియే..

Attack on government properties.. is an attack on people..– బీఆర్ఎస్ నాయకుడు కనగండ్ల తిరుపతి 
– క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ నాయకుల దాడి సిగ్గుచేటంటూ విమర్శ 
నవతెలంగాణ – బెజ్జంకి
ప్రభుత్వమంటే ప్రజలు..ప్రభుత్వ ఆస్తులపై దాడి చేయడం ప్రజలపై దాడి చేయడమేనని..మాజీ మంత్రి తన్నీర్ హరీశ్ రావు క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకుడు కనగండ్ల తిరుపతి శనివారం విమర్శించారు.ప్రజలను తప్పుదోవ పట్టించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరాచక పాలనసాగిస్తోందని ప్రజలు తగిన గుణపారం చేప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తిరుపతి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.