– మాలలందరం ఐక్యమత్యంతో ఉండాలి
– చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
నవతెలంగాణ – కంటేశ్వర్
ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన చేయాలని ఆలోచనలో ఉందని, మాలలందరూ ఏకతాటిపై ఉండి సమస్యను పరిష్కరించుకోవాలని, మాలలందరూ ఐక్యమత్యంతో ఉండాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రావ్య గార్డెన్ లో నిర్వహించిన మాలల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన చేయాలని ఆలోచనలో ఉందని తెలిపారు. మాలలందరూ ఏకతాటిపై ఉండి సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. కొందరు బురద చల్లే పనులు చేస్తుంటారని వారిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ అండ్ పార్మర్ కమిషన్ కమిటీ సభ్యులు గడుగు గంగాధర్, అలుక కిషన్, ఎడ్ల నాగరాజు, అమృత్, విజయ్, చెన్నయ్య, బంగారు సాయిలు, కేశ్పల్లి రవి,రామచందర్, ప్రదీప్, ఎల్లమయ్య, స్వామి దాస్, దేవిదాస్, సర్వయ్య, విజయ్ కుమార్, జయపాల్, సుంకరమోహన్ తదితరులు పాల్గొన్నారు.