
– బీఆర్ఎస్ పార్టీ నీచపు రాజకీయాలకు ఊతం
నవతెలంగాణ-బెజ్జంకి :
ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేకా కాంగ్రెస్ పార్టీ రైతు బందు నిలిపివేసిందని కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ బురదజల్లే ప్రయత్నం చేస్తుందని రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ అగ్రహ వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి దామోదర్ మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రైతు బందు నిలిపివేయాలని కుట్రపూరితంగా వ్యవహరించిందని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేయడం వారి విజ్ఞతకు నిదర్శనమన్నారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయడంలో శ్రద్ధ వహించకుండా కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నీచపు రాజకీయాలకు ఊతం పోస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నాయకులు రత్నాకర్ రెడ్డి, జనాగం శంకర్, రొడ్డ మల్లేశం, మంకాల ప్రవీన్, చెలుకల నరేందర్ రెడ్డి, మైల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.