నవతెలంగాణ- శంకరపట్నం: బైకును ఢీకొట్టిన ఆటో ట్రాలీ పూర్తి వివరాల్లోకి వెళితే తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామానికి చెందిన నక్క మొండయ్య, (65) తన అవసర నిమిత్తం బుధవారం కేశవపట్నం కి వచ్చి తిరిగి మొగిలిపాలెంకు వెళుతుండగా కేశవపట్నం, ఊరు చివర రైస్ మిల్ దగ్గర, కరీంపేట నుండి కేశవపట్నం, వచ్చేటువంటి ఆటో ట్రాలీ మోటార్ సైకిల్ ను ఢీకొట్టగా నక్క మొండయ్య,తలకు తీవ్రంగా గాయాలు కాగా రెండు కాళ్లు విరగడంతో రోడ్డు పైనే పడిపొగ అటువైపు వెళ్తున్న స్థానికులు చూసి 108 కి ఫోన్ చేయడంతో సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి, పైలెట్ గోపికృష్ణ, లు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని అంబులెన్స్ లోనికి తీసుకొని ప్రథమ చికిత్స అందిస్తూ కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించినట్లు సిబ్బంది తెలిపారు. పూర్తి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.