కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫొస్టాక్ ఎగ్జిక్యూటివ్స్ ( ఆహార పదార్థాల తయారీ విధానాన్ని పరిశీలించి, శిక్షణ ఇచ్చి ధ్రువపత్రాలు ఇచ్చే వారు ) లకు అవగాహన సదస్సు నిర్వహించరు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఫుడ్ అండ్ బేవరేజెస్కు సంబంధించి వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరూ ఫుడ్ సేఫ్టీ శిక్షణ ద్రోపత్రాలు తప్పనిసరిగా పొంది ఉండాలని అభ్యర్థించారు. ఈ శిక్షణలో ఆహార పదార్థాలను ఎలా రిజర్వ్ చేయాలి ఎక్స్పరీ డేట్ లను ఎలా మెయింటైన్ చేయాలి అనే విషయాల గురించి పూర్తి అవగాహన కల్పిస్తామని వారు అన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని వివిధ మండలాలకు నియమించబడిన ఎగ్జిక్యూటివ్లను శిక్షణ ఇచ్చారు. వారు మండలాలలోని అన్ని గ్రామాల వర్గం వ్యాపారుల వద్దకు వచ్చి ట్రైనింగ్ కు సంబంధించిన ధ్రువ పత్రాలు ఇవ్వడానికి గాను అప్రోచ్ కావడం జరుగుతుందన్నారు. దీనికిగాను ప్రతి వ్యాపారస్తుడు తప్పకుండా సహకరించాలని వారు కోరారు. దీనికిగాను జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం ముగిసిన వెంటనే జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ని ఫొస్టాక్ ఎగ్జిక్యూటివ్స్ కలిశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్. శిరీష గారు, సౌంత్ ఇండియా ఇన్చార్జి సింధు, మోహన్ బాబు , రాష్ట్ర కో ఆర్డినేటర్ మాలతి లత, రాష్ట్ర టీం కో ఆర్డినేటర్ మనోహర్ , నిజామాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ వినోద్ కుమార్, కామారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ ప్రశాంత్ , హార్ట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఆనంద్ ఫొస్టాక్ ఎగ్జిక్యూటివ్స్ తదితరులు పాల్గొన్నారు.