
మండలంలోని చేపూర్ గ్రామ ఉన్నత పాఠశాలలో మంగళవారం సీడీపఓ భార్గవి ఆదేశానుసారం అంగన్వాడి సూపర్వైజర్ వెంకటరమణమ్మ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సేఫ్ టచ్, ఆన్ సేపు టచ్ గురించి, వ్యక్తిగత పరిశుభ్రత ,రక్తహీనతకు గల కారణాలు ,తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించినారు. చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 10 98 అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, అంగన్వాడి టీచర్ లక్ష్మీ రమణ తదితరులు పాల్గొన్నారు.