నవతెలంగాణ – గోవిందరావుపేట
ప్రభుత్వ నిషేధిత మత్తు పదార్థాలైన గంజాయి వంటి మారక ద్రవ్యాల పై యువతకు మంగళవారం పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏ కమలాకర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పసర ఎస్సీ కాలనీలోని యువతకు ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తూ ఎస్ఐ మాట్లాడారు. యువత గంజాయి మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కావొద్దు అని.. వాటికి ఆకర్షితులు అయి ఆరోగ్యాలను , జీవితాలు నాశనం చేసుకోవొద్దు అని చెప్పారు. అంతేకాకుండా చదువు పై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని జీవితం లో ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు.ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా తమ తల్లీ తండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలియచేసారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే తమకు తెలియచేయాలని చెప్పారు. నిషేధిత మత్తు పదార్థాలైన గంజాయి వంటి వారకద్రవ్యాలను త్రాగిన కలిగి ఉన్న చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని అన్నారు.