నవతెలంగాణ – ఉప్పునుంతల
ఎండల్లో తిరిగి తాహసిల్దార్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వస్తున్న ముఖ్యంగా పేద ప్రజలకు దహార్తిని తీరుస్తూ ఉపశమనం కలిగిస్తున్న ఉప్పునుంతల మండలం రెవెన్యూ కార్యాలయం సిబ్బంది మండలంలో తాహసిల్దార్ కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన మట్టి కుండలోని చల్లటి నీరు ఏర్పాటు చేశారు. దీంతో ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఈ కుండా ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి ఉపయోగపడేలా మట్టి కుండలో నీరు సహాయపడుతున్నాయి. దీంతోపాటు చల్లటి నీటీ వలన శరీరంలోని ఉష్ణోగ్రతను సమతాస్థితిలో ఉండేలా, వడదెబ్బ నుంచి రక్షణ పొందేలా ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వం కార్యాలయం వద్ద చలివేంద్రాలను నెలకొల్పారు. ప్రజలు నీటిని తాగుతూ ఎండ నుంచి రక్షణ పొందుతున్నారు. త్రాగునీటి సౌకర్యం కల్పించిన ఎమ్మార్వో కార్యాలయం సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్న వివిధ గ్రామాల ప్రజలు.