రెంజల్ మండలంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్

నవతెలంగాణ-రెంజల్: రాబోయే ఎన్నికలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అబ్జర్వర్ లలిత్ నారాయణ సింగ్ పరిశీలించారు. మండలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు, సౌకర్యాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట రెంజల్ ఎస్సై ఉదయ్ కుమార్, ఎన్నికల కు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.