కళా సష్టి ఇంటర్నేషనల్, మణి దీప్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై మహి పాల్ రెడ్డి తెరకెక్కిసతున్న చిత్రం ‘ఉద్వేగం’. ఫస్ట్ కేసు అనేది ట్యాగ్‌లైన్. శంకర్ లుకలపుమధు నిర్మాత. త్రిగుణ్ ప్రాధాన పాత్రలో, శ్రీకాంత్ అయ్యంగార్ విభిన్న పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర టీజర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ,’కోర్టు రూమ్ డ్రామాతో తెలుగులోచాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ట్రైలర్ చూసిన తరువాత చాలా సిన్సియర్ అటెప్ట్ అనిపించింది. చాలా సహజంగా యాక్ట్ చేశారు.ఈ చిత్రం కచ్చితంగా తెలుగు పరిశ్రమలో వండర్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.
‘కోర్టు రూమ్ డ్రామాల్లో మంచి సస్పెన్స్ ఉంటుంది. తెలుగులో వచ్చిన ‘వకీల్ సాబ్’ చిత్రం తరువాత అంత డ్రామా, సస్పెన్స్ ఉన్న చిత్రమే కాదు, చట్టాన్ని బేస్ చేసుకుని తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు నాలెడ్జ్ కూడా అందిస్తుందని టీజర్ చెప్పకనే చెప్పింది’ అని చిత్రయూనిట్ తెలిపింది.