భావోద్వేగ ప్రయాణం

ప్రపంచవ్యాప్తంగా ‘నీ దారే నీ కథ’ సినిమా జూన్‌ 14న థియేటర్లలోకి వస్తోంది. అద్భుతమైన సంగీతం, ఎమోషన్స్‌తో నిండిన మరపురాని ప్రయాణంగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ అంటున్నారు. వంశీ జొన్నలగడ్డ దర్శకత్వం వహించిన ఈ సంగీత ఆధారిత కథ ఆకర్షణీ యమైన సినిమాటిక్‌ అనుభవాన్ని అందించనుంది. ఆకర్షణీయమైన కథాంశంతో మనసును కదిలించే సంగీతాన్ని మిళితం చేస్తుంది. ఈ చిత్రం అభిరుచి, స్నేహం, మన కలలను సాధించాలనే సంకల్పం, తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బంధం వంటి అంశాలతో కలిగి ఉంది. ప్రేక్షకులు భావోద్వేగాల రోలర్‌కోస్టర్‌లా ఫీల్‌ అవుతారు. ప్రేక్షకులను అలరించేలా రూపొం దించిన స్క్రీన్‌ప్లే ఇది అని చిత్ర బృందం తెలిపింది. ప్రియతమ్‌ మంతిని, విజయ విక్రాంత్‌, అనంత పద్మశాల, అంజన బాలాజీ, వేద్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు : వంశీ జొన్నలగడ్డ, తేజేష్‌ వీర, శైలజ జొన్నలగడ్డ, రచయితలు : మురళి కాంత్‌, వంశీ జొన్నలగడ్డ, సంగీతం : ఆల్బర్ట్టో గురియోలి, సినిమా టోగ్రాఫర్‌ : ఎలెక్స్‌ కావు, ఎడిటర్‌ : విపిన్‌ సామ్యూల్‌, దర్శకుడు : వంశీ జొన్నలగడ్డ.