భావోద్వేగ భరిత ప్రేమకథ

An emotional love storyఎన్టీఆర్‌ ముని మనవడు, హరికష్ణ మనవడు, జానకీరామ్‌ తనయుడు నందమూరి తారక రామారావు హీరోగా చిత్ర రంగంలోకి అడుగు పెడుతున్నారు. వైవిఎస్‌ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని న్యూ టాలెంట్‌ రోర్స్‌ ఏ బ్యానర్‌పై యల మంచిలి గీత నిర్మించనున్నారు. ఇప్పటికే లాంచ్‌ చేసిన నందమూరి తారక రామారావు ఫస్ట్‌ దర్శన్‌కి వరల్డ్‌ వైడ్‌ ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రం ద్వారా టాలెం టెడ్‌ కూచిపూడి డ్యాన్సర్‌, తెలుగు అమ్మాయి వీణారావు కథానాయికగా పరిచయం అవుతున్నారు. శనివారం వీణారావు ఫస్ట్‌ దర్శన్‌ని నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ, స్వప్న దత్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన వీణారావు షో రీల్‌ గ్లింప్స్‌ అందరినీ అలరించింది. నిర్మాత స్వప్న దత్‌ మాట్లాడుతూ, ‘వైవీఎస్‌ చౌదరి మా కుటుంబ సభ్యుల్లో ఒకరు. అన్నయ్య అని పిలుస్తాం. ఆయన ఫస్ట్‌ సినిమా మా బ్యానర్‌లోనే చేయాల్సింది. ఆయనది అద్భుతమైన జర్నీ. వీణా మా విజయవాడ అమ్మాయి. చాలా అందంగా కనిపిస్తుంది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌గా రావాల్సిన సమయం ఇది’ అని అన్నారు.
‘మా అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచే చౌదరి డైరెక్టర్‌గా పరిచయ మయ్యారు. ఆ సినిమాతో తాతయ్య (ఏఎన్నార్‌)ని డైరెక్టర్‌ చేశారు. ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ సినిమా చూసిన తర్వాత తాతయ్య చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. వైవీఎస్‌ చౌదరి తన కెరీర్‌లో ఎంతోమంది కొత్తవారిని ఇండిస్టీకి పరిచయం చేశారు. వీణారావు ఎంతో అదష్టవంతురాలు. ఇలాంటి లాంచ్‌ దొరకడం మామూలు విషయం కాదు’ అని నిర్మాత సుప్రియ యార్లగడ్డ చెప్పారు. నిర్మాత యలమంచిలి గీత మాట్లాడుతూ,’మా హీరోయిన్‌ ఫస్ట్‌ దర్శన్‌ని లాంచ్‌ చేసిన సుప్రియ, స్వప్నకి థ్యాంక్స్‌. మా హీరో ఎలా అయితే ప్రపంచ వ్యాప్తంగా హిట్‌ అయ్యారో, మా హీరోయిన్‌ని కూడా మనస్పూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.

అశ్వినీదత్‌, నాగార్జున కాంపౌండ్స్‌ నుంచి నేను వచ్చాను. వారి ఫ్యామిలీస్‌ నుంచి వచ్చి మహిళా శక్తులుగా ఎదిగిన సుప్రియ, స్వప్న చేతుల మీదుగా మా సినిమా కథానాయిక వీణారావు ఫస్ట్‌లుక్‌ దర్శన్‌ని లాంచ్‌ చేయడం అదష్టంగా భావిస్తున్నాను. వీణా మన తెలుగమ్మాయి. మంచి కూచిపూడి డ్యాన్సర్‌. అందాల రాశి. ప్రస్తుత ట్రెండ్‌కి అనుగుణంగా సాగే భావోద్వేగ భరిత ప్రేమకథ ఇది.
– వైవీఎస్‌ చౌదరి