ఎమోషనల్‌ థ్రిల్లర్‌

An emotional thrillerపూర్ణ ప్రదాన పాత్రలో పి19 ట్రాన్స్‌మీడియా స్టూడియోస్‌ పతాకంపై పటోళ్ళ వెంకట్‌ రెడ్డి సమర్పణలో సురేష్‌ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఎమోషనల్‌ థ్రిల్లర్‌ ‘డార్క్‌ నైట్‌’. జి.ఆర్‌.ఆదిత్య దర్శకుడు. త్రిగుణ్‌ (ఆదిత్‌ అరుణ్‌), విదార్థ్‌, సుభాశ్రీ రాయగురు ముఖ్య పాత్రధారులు. నిర్మాత సురేష్‌ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ, ‘ఎమోషనల్‌ థ్రిల్లర్స్‌ ‘అవును 1,’, ‘అవును 2′ చిత్రాలలో పూర్ణ నటన అద్భుతంగా ఉంటుంది. వాటికి అతీతంగా ఇందులో ఆమె నటన హైలెట్‌గా నిలుస్తుంది. తమిళ రచయిత, దర్శకుడు జి.ఆర్‌.ఆదిత్య అతీంద్రియ అంశాలతో, ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే విధంగా ఈ చిత్రాన్ని మలిచారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ మిస్కిన్‌ నేపథ్య సంగీతంతో థ్రిల్లింగ్‌ విజువల్స్‌కు ఊపిరి పోసారు. ప్రస్తుతం డబ్బింగ్‌ జరుగుతోంది’ అని తెలిపారు.