అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్‌
కొత్త ఢిల్లీకి చెందిన ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యు లు పి.నాగజ్యోతి, సీతా నాగజ్యోతిల శిష్యులు హైదరా బాద్‌లోని మాదాపూర్‌ శిల్పారామంలో ‘కూచిపూడి దర్పణం’ పేరిట కూచిపూడి నృత్యరీతులను ప్రదర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వి. శేషాద్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కూచిపూడి నృత్య రీతిని వ్యాప్తి చేయడంలో విశిష్ట కృషి చేసిన గురు వులను కొనియాడి, తన కుమార్తె శ్రియ వీరి శిష్యురాలైనం దుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రదర్శనను ఢిల్లీకి చెందిన గురువులు హైదరాబాద్‌లోని శిష్య బృందం పూ ర్వరంగంతో ప్రారంభించారు. ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యులు కీర్తి శేషులు డాక్టర్‌ వెంపటి చినసత్యం వసంతరాగంలో రూపొందిం చిన స్వరజతి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం ప్రదర్శించిన ‘వాణికి వందనం’ దశావతారం, ‘ఔరశబ్దం, ‘తులసీదాస్‌ కీర్తన, ‘కొలువైతివా, బృందావన సారంగ థిల్లాన’ ప్రేక్షకులను ఎంతగానో అల రించాయి. కూచిపూడి గురువులైన నాగజ్యోతి దంపతులు, ఈ నాట్యరీతిలో ఎంతో కృషి చేసి, తమకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. కీర్తి శేషులు పద్మ భూషణ్‌ డాక్టర్‌ వెంపటి చినసత్యం శిష్యురాలైన సీత నాగజ్యోతి 1960వ దశకంలో ఆయన వద్ద నాట్యం అభ్యసించి, 19 80వ దశకం వరకూ కూచిపూడి ఆర్ట్‌ అకాడమీ ద్వారా ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్‌ శాఖలో ఆమె వద్ద కూచిపూడి నాట్యాన్ని నేర్చుకొన్న వారు ఎందరో, ఎం తో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. నాగజ్యోతి దంప తులు ఢిల్లీ, హైదరాబాద్‌కు చెందిన తమ శిష్య బృందంతో సాంప్రదాయ రీతిలో తాము రూపొందించిన నృత్య రీతు లను ప్రద ర్శించారు. గత వారం హైదరాబాద్‌లో సీతా నాగజ్యోతి ‘బేక్‌ టు బేసిక్స్‌’ (తిరిగి మూలాలకు) వర్క్‌ షాప్‌ నిర్వహించారు. డాక్టర్‌ యశోదా ఠాకూర్‌ రిందాశరణ్య కూచిపూడి ఆర్టిస్ట్‌ అకాడమీతో కలసి ఏర్పా టు చేసిన ఈ వర్క్‌ షాప్‌ లో నేర్పించిన ‘స్వరజతి’ ప్రదర్శించారు. ప్రొఫెసర్‌ టిజి రూప, భమిడిసాయి శిరీష, ఎల్‌. శృతి, శ్రియ శేషాద్రి, కావ్య గోపాలకృష్ణ, రుద్ర వైష్ణవికరణం, శివాని, కీర్తన సుబ్రహ్మణ్యం, సాయి యుక్త, పి.చార్వి, మేఘ, మనస్వి, చరితలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.