సరిహద్దులు దాటి అలరించే సినిమా

An entertaining movie that transcends bordersనాని తాజాగా నటిస్తున్న చిత్రం ‘హారు నాన్న’. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి (సివిఎం), డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ పాన్‌ ఇండియా సినిమా టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు హీరో నాని ఇచ్చిన సమాధానాల సమాహారం..
తండ్రీకూతుళ్ళ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి కదా.. వాటితో పోలిస్తే ఇదెలా ఉంటుంది?
– అవును. అయితే ఇది చాలా యూనిక్‌ సబ్జెక్ట్‌. ఒకొక్క ప్రమోషన్‌ కంటెంట్‌ వచ్చే కొద్ది కథ, కాన్సెప్ట్‌ ప్రత్యేకత గురించి తెలుస్తూనే ఉంటుంది. ఒక మంచి సినిమా తీయాలి. ప్రేక్షకులకు ఎఫెక్టివ్‌ ప్రోడక్ట్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసిన అచ్చమైన తెలుగు సినిమా ఇది. మన సరిహద్దులు దాటి అలరించే సినిమా ఇది.
మీ అబ్బాయి ‘హారు నాన్న’ అని పిలిచినప్పుడు మీ ఫీలింగ్‌?
– చాలా గ్రేట్‌ ఫీలింగ్‌ అండీ. ‘ఈ పేరు నేనే పెట్టాను కదా’ అని అంటుంటాడు. నువ్వే పెట్టావ్‌ నీ సినిమానే అని చెబుతుంటాను.
జెర్సీ, హారు నాన్న లాంటి సినిమాలు అర్థం చేసుకునే వయసు వాడికి ఉందో లేదో తెలీదు. కానీ ఏదో ఒక రోజు ఈ సినిమాలు చూసి గర్వపడతాడని నా నమ్మకం.
సలార్‌ సినిమాకి ముందుగానే మీ సినిమా రిలీజ్‌ కావడం ఎలా అనిపిస్తోంది?
– ఒక ఇంట్లో పెద్ద అబ్బాయి కి సంబధించిన ఏదైనా వేడుక వుంటే.. చిన్నోడి వేడుకని ముందుకు వెనక్కి జరపడం సహజం. దీని వలన ఎలాంటి సమస్య లేదు. డిసెంబర్‌ అంతా ఒక లవ్‌ స్టొరీ, యాక్షన్‌ సినిమాలతో కళకళలాడిపోతుంది. ఇంతకంటే మనకేం కావాలి. (నవ్వుతూ)
కియారా, మృణాల్‌ పాత్రల గురించి ఏం చెబుతారు?
– నా కూతురిగా కియారా ఖన్నా అద్భుతంగా చేసింది. టీజర్‌లో చూసింది నథింగ్‌. సినిమాలో తన పాత్ర మీ అందరి మనసులకు హత్తుకుంటుంది. ఇక మృణాల్‌ పాత్ర ఎలా ఉంటుందో మీరే సినిమా చూసి తెలుసుకోవాలి.