అలరించిన నటరాజ నృత్యానికేతన్ చిన్నారుల ప్రదర్శన

నవతెలంగాణ – ఆర్మూర్  

ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని హరి చరణ మార్వాడి పాఠశాలలో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో భాగంగా శనివారం పట్టణం లో గల నటరాజ నృత్యనికేతన్ కి చెందిన 15 మంది చిన్నారులు నృత్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను చిన్నారుల ప్రదర్శనకు అతిధులు మంత్రముగ్ధులై ప్రశంసా పత్రాలు ,శాలువులతో సత్కరించడం జరిగింది అని నాట్య గురువు బాశెట్టి మృణాళిని, తెలిపారు. ఈ సందర్భంగా .విద్యార్థినుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తపరిచారు.