ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందు తున్న చిత్రం ‘ఆరు’. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహి స్తున్నారు. బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ రూపంలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ ఫన్ ఎంటర్‌టైనర్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేస్తున్నారు. ”ఆరు’ను విడుదల చేయటానికి ఇండిపెండెన్స్ డే పర్‌ఫెక్ట్ డేట్. ఎందుకంటే ఆగస్ట్ 15న గురువారం, తర్వాత రోజు నుంచి వీకెండ్ ప్రారంభం అవుతుంది. ఇక సోమవారం రోజున రక్షా బంధన్ కావడంతో ఆ రోజు కూడా కలిసొస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే క్యారెక్టర్ టీజర్, పాటలను మేకర్స్ విడుదల చేశారు. రెగ్యులర్‌గా మూవీ అప్‌డేట్స్‌ను ఇస్తున్నారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా రూపొందింది. ఈ ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో నార్నే నితిన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమాకు సహ నిర్మాతలు – భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, ఎడిటర్ – కోదాటి పవన్ కళ్యాణ్, ఆర్ట్ డైరెక్టర్ – కిరణ్ కుమార్ మన్నె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అజరు గద్దె, కాస్ట్యూమ్స్ – సుష్మిత, శిల్ప.