నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సదరు సమ్మేళనం రాష్ట్ర పండుగ గుర్తించడంతో ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో వినాయక చౌరస్తా వద్ద సదరు సమ్మేళనాన్ని శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై మాట్లాడారు. యాదవుల సదరు ఉత్సవం శ్రీకృష్ణుడు గోవులను రక్షించడానికి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి గోవులను రక్షించాడని, అప్పటినుంచి సదరు సమ్మేళనం కొనసాగుతుందన్నారు. ఆనాటి నుంచి పశుసంపదను పెంచడంలో, వాటిని పూజించడంలో యాదవులకు ఎవరు సాటిలేరని అన్నారు. సదరు సమ్మేళనాన్ని హైదరాబాద్ రాష్ట్రంలో మాత్రమే నిర్వహించే వారని, సదరు సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని యాదవ ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డి సదరు ఉత్సవాన్ని రాష్ట్ర పండుగ గుర్తించి, ఒక కోటి 50 లక్షల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. యాదవులు ఒకే వేదిక పైకి రావడం, సుఖ సంతోషాలను పంచుకుంటూ.. పశు సంపదను పూజించడం, పెంచడం, చేస్తారని దీపావళి పండుగ సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తారని తెలిపారు. యాదవులు ఐక్యంగా ఉండి, బీసీలు, ఇతరులు అందరూ ఒకరినొకరు గౌరవించుకొనీ, రాజకీయంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అంబర్ పేట శ్రీనివాస్ యాదవ్, యాదవ సంగం రాష్ట్ర నాయకులు వట్టే జానయ్య యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, పృధ్వీరాజ్ యాదవ్ అందేల లింగం యాదవ్, శ్రీకృష్ణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టా విరేష్ యాదవ్, సీరమైన వెంకటేష్ యాదవ్, గుండెబోయిన సురేష్ యాదవ్, బెల్లీ చంద్రశేఖర్ యాదవ్, మాజీ ఎంపీపీ తోటకూర వెంకటేష్ యాదవ్, అవిశెట్టి రమేష్ యాదవ్, వడిచెర్ల కృష్ణ యాదవ్, మధు యాదవ్ , కొత్తపల్లి ఆనంద్ యాదవ్, యాద మల్లయ్య యాదవ్, మర్రి పాండు యాదవ్ , రేఖల రమేష్ యాదవ్, లడ్డు యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి పెద్ద ఎత్తున యాదవ సంఘాల ప్రజా ప్రతినిధులు, అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.