– ఆటపాటలతో ఆనందాలు ఆస్వాదించారు
– ఒకే చోట 150 మంది వనభోజనాలు చేసిన కుటుంబ సభ్యులు
నవతెలంగాణ-రామగిరి : అందరికీ ఆదర్శంగా నిలిచిన కుటుంబం… కుటుంబంలోని 150 మంది ఒకే చోట కలిసి ఆటపాటలతో అలరించారు…..గుండారం గ్రామం నుండి ఎడ్లబండ్లతో భారీ కాన్వాయ్ ఊరేగింపు.. రామగిరి మండలం లొంక కేసారం శివార్లలోని వారి సొంత భూముల్లో డీజే డ్యాన్స్ మధ్య ఆటపాటలతో ఎంజాయ్ చేశారు.
వివరాలకు వెళ్తే కమాన్ పూర్ మండలంలోని గుండారం గ్రామానికి చెందిన స్వర్గీయ మురాద్ కుటుంబ సభ్యులు సుమారు 150 పైచిలుకు వనభోజనాలకు వెళ్లారు. గుండారం గ్రామంలో ఎడ్లబండ్లలో డీజే చప్పుళ్ల మధ్య గుండారం గ్రామం లో ఊరేగింపు మొదలై కమాన్ పూర్ క్రాస్ రోడ్ వద్దకు చేరుకుంది. అనంతరం రామగిరి మండలంలోని లొంక కేసారం శివారులో గల వారి భూముల్లో టెంట్లు వేయించి అక్కడ టగ్ ఆఫ్ వార్ క్విజ్ పోటీలు కుర్చీ పోటీలు నిర్వహించారు. అలాగే వారి కుటుంబ సభ్యుల్లో సభ్యుడైన పోలీస్ శాఖ లో పనిచేస్తున్న ఎస్ఐ అన్వర్ ఆలపించిన పాటలతో అలరించారు. డీజే వద్ద రిటైర్డ్ జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ ఖాన్ అహద్ అన్వర్ సీనియర్ పాత్రికేయుడు జబ్బర్ ఖాన్ హైదరాబాద్ మతిన్ షాబాజ్ ఖాన్ అబ్దుల్ ఖాదర్ గోదావరిఖని వాజిద్ అడవి శ్రీరాంపూర్ వాజిద్ అల్ఫాన్ ఖాన్ సాజన్ అయాన్ అషు తదితరులు తమ తమ డాన్సులతో అలరించారు. కాగా ఈ వేడుకలను మనుమలు అఫ్జల్ ఖాన్ సర్వర్ సులేమాన్ ఖాన్ జావీద్ ఖాన్ ముజాహిద్ ఖాన్ ఇజాజ్ ఖాన్ షాబాజ్ ఖాన్ మతీన్ ఖాన్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. అలాగే అబ్దుల్ ఖాదర్ కుటుంబ సభ్యులకు క్విజ్ నిర్వహించి బహుమతులను సీనియర్ జర్నలిస్ట్ జబ్బర్ ఖాన్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులైన పెద్ద లు ఎండి గని ఆస్మా బేగం ఖమర్ పాషా మునీర్ షమీం భాష తోపాటు జబ్బార్ ఖాన్ సాజిద నస్రిన్ లను వారి కుటుంబంలోని కుమారులు కోడండ్లు కూతుళ్లు అల్లుళ్లు ఘనంగా సన్మానించారు. అనంతరం కుటుంబ సభ్యులు అంతా కలిసి వనభోజనాలను చేశారు. కాగా వారి ఊరేగింపును ప్రజలంతా చూసి హర్షం వ్యక్తం చేశారు. కాగా ఓపెన్ టాప్ జీపులో వారి కుటుంబంలో సభ్యుడైన జబ్బర్ ఖాన్ తోపాటు పలువురు బయలుదేరి వెళ్లారు. ఈ వేడుకల్లో అబ్దుల్లా ఖాన్, అలీ మొహమ్మద్ నబి ,ఇంతియాజ్, సోహెల్, ఇర్షాద్ ,ఫైజ్ అక్రమ్, రనీస్, షాహేద్ అజీబ్ సాజన్ తదితరులు పాల్గొన్నారు.