అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

Excellent A family entertainerహీరో రామ్‌ పోతినేనితో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న మాస్‌ యాక్షన్‌ పాన్‌ ఇండియా ఎంటర్‌ టైనర్‌ ‘స్కంద- ది ఎటాకర్‌’. శ్రీలీల నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్‌ 15న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ థండర్‌ ఈవెంట్‌ని నిర్వహిం చారు. నందమూరి బాలకష్ణ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ, ”ఈ సినిమా తప్పకుండా బాగా ఆడాలని కోరుకుం టున్నాను. బోయపాటి చాలా అంకితభావంతో పని చేస్తారు. తమన్‌ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దేవదాస్‌ నుంచి రామ్‌ ప్రయాణం చూస్తున్నాం. అన్ని రకాల వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఎంతో తపన ఉన్న నటుడు. మనం అందరం గర్వించదగ్గ నటుడు, కళామతల్లి మనకి ఇచ్చిన ఒక వరం. శ్రీలీల అభినయం, నతం అన్ని కలగలిపిన ప్రతిభ ఆమె సొంతం. సయీ మంజ్రేకర్‌ ప్రధాన పాత్ర పోషించారు. ట్రైలర్‌లో చూసినట్లే సినిమా కూడా కన్నుల విందుగా, చెవులకు ఇంపుగా ఉంటుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. ‘తమన్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. త్వరలో ఒక పాట వస్తుంది అది మాములుగా ఉంటుంది. అది వింటే ఈ సినిమా మీటర్‌ ఏమిటో బాగా అర్థమవుతోంది. నిర్మాత శ్రీనివాస్‌ లేకపోతే ఈ సినిమా ఉండదు. బోయ పాటి మొండిగా నమ్మి వెళ్ళి పోతారు. బాలయ్య గురించి ఒక మాట చెప్పాలి. మాస్‌, క్లాస్‌, ఫ్యామిలీ, అమ్మాయిలు .. ఇలా అన్నీ సెక్షన్స్‌ జై బాలయ్య మంత్రం జపిస్తుంది. నా ఫ్యాన్స్‌కి ఒక మాట చెప్పాలి. పులి వేటకి వచ్చింది. నా లక్కు మీరే నా కిక్కు మీరే’ అని హీరో రామ్‌ పోతినేని అన్నారు.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ,’బాలయ్యతో ‘అఖండ 2′ ఉంటుంది. ప్రేక్షకులకు, రామ్‌ అభిమానులకు ఒక్కమాట కచ్చితంగా చెప్పగలను. గుండె మీద చేయి వేసుకొని ఈ సినిమా చూడండి. ఇదొక అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్‌. పరిపూర్ణమైన సినిమా ఇది. ఇందులో రామ్‌ అద్భుతంగా నటిం చాడు. బాగా నటించాలనే తపనే ఆయన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. శ్రీలీల, సయీ మంజ్రేకర్‌ మిమ్మల్ని అలరిస్తారు’ అని అన్నారు.
కథానాయిక శ్రీలీల మంచి డాన్సరే కాదు.. మంచి గాయని కూడా అని ‘స్కంద’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిరూపించింది. స్టేజ్‌పై ఆమె తమన్‌తో కలిసి పాట అందర్నీ మంత్రముగ్దుల్ని చేసింది. ‘ధమాకా’ రిలీజ్‌కి ముందు సైన్‌ చేసిన చిత్రమిది. బోయపాటికి థ్యాంక్స్‌. బాలయ్య గురించి చాలా చెప్పాలని ఉంది. మరో నెలలో ఇలాంటి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుంది అప్పుడు చెబుతాను. (నవ్వుతూ). తమన్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. రామ్‌తో పని చేయడం చాలా అనందంగా ఉంది. ‘గండర బారు’ పాట షూటింగ్‌ చేసినప్పుడు డ్యాన్స్‌లో మా ఎనర్జీ ఎక్స్‌చేంజ్‌ చేసుకునేలా అనిపించింది. అది గ్రేట్‌ మూమెంట్‌. ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన బోయపాటికి కృతజ్ఞతలు.
– శ్రీలీల