– చాంపియన్స్ అనిరుధ్, విక్రమ్ లగడపాటి
హైదరాబాద్ : ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఆల్ ఇండియా టోర్నమెంట్‌లో అనిరుధ్ సోమ్‌పల్లి, విక్రమ్ లగడపాటి టైటిల్ సాధించారు. ఓ ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మాణం కోసం నిధుల సమీకరణకు కొండాపూర్‌లోని పికిల్‌బాల్ ఏరినాలో డిసెంబర్ 1న టోర్నమెంట్ నిర్వహించారు. ఫండ్ రైజర్ టోర్నమెంట్‌కు విశేష స్పందన రావటంతో రోజంతా మ్యాచులు సాగాయి. పికిల్‌బాల్ పోటీలతో పాటు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన, ఫిట్‌నెస్‌పై వర్క్‌షాపులు నిర్వహిస్తూ సందడిగా జరిగింది. దాసోస్ క్యాబినెట్స్, ఏరెటె హాస్పిటల్స్, నేయ స్కిన్ క్లినిక్ సహా సాత్విక రుచులు ఈ ఫండ్ రైజింగ్ టోర్నమెంట్‌కు మద్దతు పలికాయి.