22, 23 తేదీల్లో బాహుబలి లాంటి ఎగ్జిబిషన్‌

– 100శాతం ప్లాస్టిక్‌ ఫ్రీ ప్రదర్శన
– సందర్శకులకు 5వేలకుపైగా మొక్కలు పంపిణీ :
– ప్రముఖ డిజైనర్‌ అస్మితా మార్వా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో (సిగేచర్‌ ఈవెంట్‌, స్టైల్‌తత్వ, ఎడిషన్‌3, అన్ని ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌లలో బాహుబలి లాంటి) ఎగ్జిబిషన్‌ ను ఈనెల 22, 23 తేదీలలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్టు అంతర్జాతీయ ప్రముఖ డిజైనర్‌ అస్మితా మార్వా అన్నారు. ఈ కార్యక్రమానికి మేయర్‌ విజయలక్ష్మి గద్వాల్‌, ఎఫ్‌ఎల్‌ఓ జాతీయ అధ్యక్షురాలు సుధాశివకుమార్‌ ప్రారంభించనున్నారని, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయే ష్‌ రంజన్‌, అదనపు డీజీపీ శిఖా గోయెల్‌ హాజరు కానున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఓ హౌటల్‌లో మంగళవారం నిర్వహించి న విలేకరుల సమావేశంలో మాట్లా డారు. అంతరిస్తున్న తెలియా రుమ ల్‌ను కళను ప్రోత్సహించడం ప్రశం సనీయమన్నారు. ఎఫ్‌ఎల్‌ఓ చైర్‌ పర్సన్‌ రీతూ షా మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్‌ వంద శాతం ప్లాస్టిక్‌ రహి తమని అన్నారు. ప్రవేశ రుసుము రూ.100 ఉంటుందని, 240 స్టాల్స్‌ ఉంటాయని తెలిపారు. సందర్శకుల కు ఐదువేలకుపైగా మొక్కలను పంపిణీ చేయనున్నట్టు చెప్పారు.