మహా లక్ష్మీదేవికి ప్రతిరూపం..

An image of Goddess Lakshmi.పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈనెల 14 నుంచి ఈ చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం యాక్షన్‌ దర్శకుడు స్టంట్‌ సిల్వ పర్యవేక్షణలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న నిధి అగర్వాల్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌తో చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది. పోస్టర్‌లో మహాలక్ష్మి దేవి అవతారంగా నిధి అగర్వాల్‌ అందర్నీ అలరిస్తోంది. అణగారిన వర్గాల కోసం పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఒక యోధుడిగా ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ కనిపించనున్నారు. దర్శకుడు జ్యోతి కష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఏ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.దయాకర్‌ రావు భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ‘హరి హర వీర మల్లు పార్ట్‌-1 స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ త్వరలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.