సందేశాత్మక చిత్రం

కార్తిక్‌ రాజు, ప్రశాంత్‌ కార్తి, మిస్తి చక్రవర్తి, ఆమని, దేవి ప్రసాద్‌, భీమినేని శ్రీనివాసరావు, పోసాని కష్ణమురళీ ప్రధాన పాత్రల్లో అవి క్రియేషన్స్‌ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘అను’. తేజస్వి క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌ మీద సందీప్‌ గోపిశెట్టి ఈ సినిమాకు దర్శక, నిర్మాత బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
ఈ సినిమా గురించి ఆమని మాట్లాడుతూ, ‘సినిమా చాలా బాగా వచ్చింది. నేను ఇందులో కొత్త క్యారెక్టర్‌ను పోషించాను. ఇదొక మంచి సందేశాత్మక చిత్రం’ అని తెలిపారు. ‘ఇది నా మొదటి చిత్రం. మూవీ అద్భుతంగా వచ్చింది. సెప్టెంబర్‌లో సినిమాని రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం’ అని దర్శక, నిర్మాత సందీప్‌ గోపిశెట్టి అన్నారు. లైన్‌ ప్రొడ్యూసర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి మాట్లాడుతూ, ‘సినిమా చాలా బాగా వచ్చింది. సంగీతం అద్భుతంగా ఉంటుంది. ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేశారు. నాకు సినిమా నచ్చి రిలీజ్‌ చేసేందుకు ముందుకు వచ్చాను’ అని అన్నారు.