సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి..

An inquiry should be conducted with the sitting judge of the Supreme Court.నవతెలంగాణ  – ఆర్మూర్
ఆఖరి యుద్ధం పేరు తో దేశం లో నరమెదం స్పృష్టిస్తూ అమాయకులను హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని ఐఎఫ్టియు శ్రామిక స్పందన .రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ అన్నారు. పట్టణంలో గురువారం మాట్లాడుతూ  దేశం లో జీడీపీ 6%మాత్రమే ఉన్నది దీనిని పెంచాడానికి ఆలోచించాల్సింది పోయి ప్రజల మౌలిక సమస్యలు పరిష్కార కోసం పోరాడుతున్న నక్సలైట్లను చంపడం దుర్మార్గమైన చర్య.దేశంలో రోజురోజుకు ఆకలి,దరిద్రం, మతోన్మాదం పెరిగిపోతున్నది దీనిని ప్రశ్నించినందుకే ఈ ఎన్కౌంటర్లు అమిత్ షా,మోడీ ప్రభుత్వాలు చేస్తున్నాయి అని అన్నారు.. దోపిడీ పీడన,అసమానతలు ఉన్నంతవరకు నక్సలైట్ల పోరాటాలు  సజీవంగా ఉంటాయని అన్నారు. ఎమర్జెన్సీ పేరట మెరికలు లాంటి పోరాట యోధుల్ని చంపిన కూడా నక్సలైట్ల ఉద్యమం ఆగిందా!  ఒక అడుగు వెనుకకు వేయొచ్చు కానీ రెండు అడుగులు ముందుకు వేయడానికి  అనే నగ్నసత్యం గుర్తుంచుకోవాలి.  గత ఏడాది నుంచి నేటి వరకు 261 మంది మావోయిస్టులను ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నది.  మోడీ ,అమిత్ షా  కార్పొరేట్ల శక్తులకు  ఖనిజ సంపాదనను బహుళ జాతి కంపినాలకు కట్టబెట్టడం కోసమే ఈ ఎన్కౌంటర్లు చేస్తున్నది  అని అన్నారు. నేడు పాలక వర్గ పార్టీలో ఉన్న వారు కూడా నక్సలైట్లు ఉండాలని మాట్లాడుతున్నారు, నక్సలైట్ల ఎజెండానే మా ఏజెండాని మాట్లాడి  అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలైట్లును చంపడమే ఏజెండాగా పెట్టుకుంటున్నారు అని అన్నారు. నక్సలైట్ల సమస్య రాజకీయ,సామాజిక,ఆర్థిక సమస్య అని అన్నారు. ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు కోనసాగిస్తే  నక్సలైట్ల ఉద్యమాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి  అని అన్నారు. ఈ జనవరి నేల లోనే చెత్తిస్ గడ్ – ఒరిస్సా  లో జరిగిన బూటకు ఎన్కౌంటర్ లో మరణించిన 42 మందిపై సుప్రీం కోర్టు సీట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని అన్నారు. ఈ సమావేశంలో భారత రైతుకుల సంఘం. బొట్ల  రాజు ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాను బేగం ,పెద్దలు తదితరులు పాల్గొన్నారు.