
చిటిమెల హరిప్రసాద్ ఆర్యవైశ్య జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం బొర్గం (పి) వద్ద ఉన్న 4 ఎకరాల 22 గుంటల భూములపై విచారణ జరిపించాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మోపల్ మండల తహశీల్దార్ గారికి పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వటం జరిగింది. వారు మాట్లాడుతూ చిటిమెల హరిప్రసాద్ ఆర్యవైశ్య జూనియర్ కళాశాల కోసం 4 ఎకరాల 22 గుంటలు ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసారని,1994లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ.కోట్ల విజయ భాస్కర్ రెడ్డి శంకుస్థాపన చేసారని అది ఇప్పటి వరకు కళాశాల నిర్మించలేదని , కాలేజీ కోసం ఏర్పాటుచేసిన ట్రస్ట్ భూములు ఏమయ్యాయని, విద్యార్థుల కాలేజ్ ఏర్పాటుకు కోసం ఉన్న భూములను కొంత మంది వ్యక్తులు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జా చేయటం సరైంది కాదని కావున ఆర్య వైశ్య జూనియర్ కళాశాల భూములపై విచారణ జరిపించాలని , భూములను కాపాడాలని , భూములను విద్యార్థుల కళాశాల నిర్మాణానికి వాడాలని లేనిచో ఆందోనల కార్యక్రమలు చేపడతామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ జిల్లా సహాయ కార్యదర్శి దేవిక ,కోశాధికారి పవన్ జిల్లా నాయకులు సునీల్.నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.