ఉత్సాహ విగ్రహంలా సమీకృత భవనం

– పనులు పూర్తి  కావడంలో జాప్యం
– ఎమ్మెల్యే పోచారం ఆదేశాలు బేఖాతర్

నవతెలంగాణ నసురుల్లాబాద్
మండల ప్రజలకు మెరుగైన సేవలను వేగంగా అందడంలో భాగంగా అధికారులకు  అవసరాలకు తగ్గట్టుగా అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మండల సమీకృత సముదాయ భవనం నిర్మించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా  కోట్ల రూపాయలతో నిర్మించిన మండల సమీకృత సముదాయ భవనంలో ఉత్సాహ విగ్రహం లాగా కనిపిస్తుందని మండల ప్రజలు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండల సమీకృత సముదాయ భవనం కోసం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపి నిధులు మంజూరు చేశారు. ఆగస్టు 2021లో 1 కోటి రూపాయలతో భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా భవన నిర్మాణం పనులు జాప్యం జరగడంతో అదనంగా మరో 30 లక్షలు నిధులను కేటాయించడం జరిగింది. భవన నిర్మాణానికి కోటి 30 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కానీ కొన్ని పనులు పూర్తిగా కాకపోయినా  అక్టోబర్ 2023 లో అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మండల సమీకృత సముదాయ భవనాని ప్రారంభోత్సవం చేశారు. చిన్న చిన్న పనులు పూర్తిచేయాల్సి ఉండగానే ప్రారంభించారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భవనాన్ని ప్రారంభించి 10 మాసాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ అధికారులు ఆ భవనంలోకి వెళ్ళలేదు. మండల సమకృత భవనంలో తహసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, వ్యవసాయ శాఖ కార్యాలయం, ఉపాధి హామీ కార్యాలయం, గ్రామపంచాయతీ కార్యాలయం, విద్యాశాఖ కార్యాలయం అలా మండల కార్యాలయాల కోసం ఏర్పాటు చేసిన భవనం ఉత్సాహ విగ్రహం లాగా కనిపిస్తుంది. ఇప్పటికీ ఇంకా చిన్న చిన్న పనులు చేయవలసి ఉందని తెలిసింది.

పనులు పూర్తికాకుండానే.. రెండుసార్లు ప్రారంభోత్సవం

మండల ప్రజల సౌకర్యార్థం మండల సమీకృత సముదాయ భవనం పనులు పూర్తికాకుండానే ఒకసారి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించగా 4 జూన్ 2024న ఎంపీపీ పాల్త్య విట్టల్ ప్రారంభించారు. మండల సమీకృత భవనం పూర్తి కాకుండానే ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ పనులు పెండింగ్లోనే ఉన్నాయి. గత మూడు సంవత్సరాల నుండి మండల సమీకృత భవనం పనులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. మండల రెవెన్యూ కార్యాలయం నసురుల్లావత్ సొసైటీ భవనంలో కొనసాగుతుంది. చాలీచాలని గదులు ఇరుకుగా గదుల్లో కార్యాలయం కొనసాగుతుంది. ఒక అధికారి కూర్చుంటే మరో అధికారి నిల్చుండే పరిస్థితి ఏర్పడింది. ఎంపీడీవో కార్యాలయం ఇరుకు గదుల మధ్య కొనసాగుతుంది. వ్యవసాయ శాఖకు భవనం లేక రైతుబంధు కొనసాగుతుంది. విద్యాశాఖ భవనం ఉన్నప్పటికీ ఓ ప్రభుత్వ పాఠశాల ఇరుకు గదిలో ఎంఈఓ కార్యాలయం కొనసాగుతుంది. మండల సమీకృత భవనం పనులు పూర్తయి సమీకృత భవనంలో అన్ని కార్యాలయాలు అక్కడికి చేరితే మండల ప్రజలకు అన్ని సౌకర్యాలు సదుపాయాలు కలుగుతాయనే ఆశలు అడి ఆశలగనే మిగిలిపోతున్నాయి. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టుల అలసత్వంతో సకాలంలో జరగవలసిన పనులు పూర్తిగాకపోవడంతో అభివృద్ధిలో ఆటంకం కలుగుతుంది. పనులు వెంటనే పూర్తి చేయాలని పలుమార్లు మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించిన కాంట్రాక్టర్లు అధికారులు వారి ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు పూర్తి చేసి మండల సమీకృత సముదాయ భవనంలోకి అన్ని కార్యాలయాలు వచ్చేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.