ఇంటెన్స్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌

నిఖిల్‌ దేవాదుల హీరోగా నటిస్తున్న సినిమా ‘ఘటికాచలం’. ఈ చిత్రానికి కథ అందిస్తూ, ఒయాసిస్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ బ్యానర్‌ పై నిర్మాత ఎం.సి.రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అమర్‌ కామెపల్లి దర్శకుడు. శనివారం ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లు ని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ ఫస్ట్‌ లుక్‌లో రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తున్నారు హీరో నిఖిల్‌ దేవాదుల. ఈ రెండు లుక్స్‌లో ఒకటి ఇన్నోసెంట్‌గా, మరొకటి ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. టైటిల్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తున్నాయి. ఇందులో ఈటీవీ ప్రభాకర్‌, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజరు రారు చుర, దుర్గాదేవి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.