పేదలకు, ఉద్యోగులకు నిరాశ మిగిల్చిన మధ్యంతర బడ్జెట్

 – కాంగ్రెస్ నాయకులు  కట్టెబోయిన అనిల్ కుమార్
నవతెలంగాణ – హాలియా
నాగార్జున సాగర్ నియోజకవర్గం మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో ముఖ్యంగా భారతదేశం లో ఎక్కువ  మంది జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించడం, ఆహరం ఎరువుల రాయితీల్లో తగ్గుదల ఇతర ఉత్పతులపై రాయితీలను విస్మరించడం, పతాక స్థాయికి చేరిన దేశ నిరుద్యోగాన్ని నియంత్రించే దిశగా ప్రణాళికలు చేయకపోవడం విచారకరం. తాము కష్టపడి సంపాధించిన ప్రతి పైసకు పన్ను కడుతూ దేశ ప్రగతి లో పాలుపంచుకుంటున్న ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూసిన పన్ను స్లాబు లలో, పన్ను మినహాయింపులలో ఎలాంటి మార్పులు చేయకపోవాడం వారి ఆశలపై నీళ్లు చల్లడమే, ఆకాశన్ని అంటుతున్న డీజీల్, పెట్రోల్, గ్యాస్ ధరల భారాన్ని పేద ప్రజల పై తగ్గించే ప్రయత్నం చేయకపోవాడం మోడీ సర్కార్ కి పేద ప్రజలకంటే కార్పొరేట్ వ్యవ్యస్థలపైనే తమ ప్రేమ అని,  బీద వర్గాలపైన తమ ప్రాధాన్యం సవితి ప్రేమలాంటిది అని చెప్పకనే చెపుతుంది.